Sharwanand Haldi Function : ఘనంగా నటుడు శర్వానంద్ పసుపు ఫంక్షన్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ప్రేక్షకులని అలరిస్తున్నారు, చిన్నప్పటి నుండే ఆక్టర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన శర్వా దాదాపుగా 35కి పైగా సినిమాలలో హీరో గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. రియల్ లైఫ్ ఎప్పుడూ సైలెంట్ గా ఉంటూ చాలా తక్కువగా మాట్లాడే శర్వానంద్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే, తన రీసెంట్ ఫిల్మ్ ఒకే ఒక జీవితం బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ గా హిట్ గా నిలిచింది. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అయిన శర్వానంద్ త్వరలో పెళ్లి చేసుకోబుతున్న సంగతి అందరికి తెలిసిందే !

ఈ ఇయర్ జనవరి 26న రక్షిత రెడ్డి తో శర్వానంద్ కి ఫ్యామిలి మరియు బందు మిత్రుల సమక్షం లో ఘనంగా ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే, అయితే ఈ జూన్ 3న శర్వానంద్, రక్షితల వివాహం జైపూర్ లోని లీలా ప్యాలస్ లో అంగరంగ వైభవంగా జరగబోతుంది. జునె 1వ తేదీ నుండే శవా ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది, మొదటి రోజు పెళ్లి కొడుకు ఫంక్షన్, ఆ తరువాత మెహింది వంటి ఫంక్షన్స్ ని చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. పెల్లి ముందు రోజు నైట్ ఫ్రెండ్స్ అలాగే సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో సంగీత్ ఈవెంట్ ని కూడా నిర్వహించారు. ముఖ్యంగా శర్వానంద్ పసుపు ఫక్షన్ కి సంభందించిన కొన్ని ఫొటోస్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతున్నాయి, ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరూ చూసేయండి.