Sharwanand Wedding Photos : ఘనంగా జరిగిన శర్వానంద్ వివాహం
తెలుగు మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ శర్వానంద్ ఈ జూన్ 3న ఒక ఇంటి వాడయ్యాడు, ఈ సంవత్సరం జనవరిలో ప్రముఖ పాలిటీషియన్ కూతురైన రక్షితా రెడ్డి తో శర్వా కి ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి అందరికి తెలిసిందే, ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో నటిస్తూ బిజీగా గడిపేస్తున్న శర్వానంద్ తన పెళ్ళి కారణంగా కొంత కాలం పాటు షూటింగ్స్ నుండి బ్రేక్ తీసుకున్నారు. జూన్ మొదటి రోజు నుండే శర్వానంద్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. శర్వానంద్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు, జైపూర్ లోని లీలా మహల్ ప్యాలస్ లో మొదట హల్దీ తో మొదలైన ఈ వెడ్డింగ్ ఫంక్షన్, తరువాత సంగీత్, ఆ తరువాత పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు వంటి ఈవెంట్స్ చాలా గ్రాండ్ గా జరిపారు.
ఈ జూన్ మూడవ తారీఖున జరిగిన ఈ పెళ్లికి ఫ్యామిలి, ఫ్రెండ్స్, బందు మిత్రులతో పాటూ ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు కూడ అటెండ్ అయి నవ దంపతులకి బెస్ట్ విషెస్ ని తెలియజేశారు. రాం చరణ్, రానా, అల్లు ఫ్యామిలి, మెగా ఫ్యామిలి, సీనియర్ హీరోయిన్స్ అలాగే ఇతర టాలీవుడ్ సినీ నటీ నటులంతా ఈ వేడుకలో సందడి చేశారు. శర్వానంద్ రక్షితల వెడ్డింగ్ కి సంభందించిన కొన్ని ఫొటోస్ బయటికి వచ్చాయి. ఈ పిక్స్ చూసిన వాళ్లంతా నూతన వధూవరులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. తెలుగు యంగ్ హీరో శర్వానంద్ మ్యారేజ్ ఫొటోస్ ని మీరూ చూసేయండి !