Anasuya 38th Birthday : ఫ్యామిలితో అనసూయ బర్త్ డే సెలెబ్రేషన్
ట్.వి. షోస్ తో, మూవీస్ తో అలాగే కొన్ని చిన్న చిన్న కాంట్రవర్సి విషయాలతో నిరంతరం వార్తల్లో ఉండే ఒక పేరు అనసూయ గారు. మొదట ఆంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం వరుస మూవీస్ తో బిజీగా గడిపేస్తుంది, త్వరలో “విమానం” అనే ఒక ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్స్ తో వచ్చే సినిమాలో లీడ్ ఫీమేల్ ఆక్ట్రెస్ గా కనిపించబోతుంది అనసూయ. అనసూయ భర్త పేరు సూశాంక్ గారు, వీళ్లకి ఇద్దరు పిల్లలున్న సంగతి తెలిసిందే ! అయాన్ష్ అలాగే శౌర్య. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలి నుండి వచ్చిన అనసూయ తన స్వంత టాలెంట్ అంచెలంచెలుగా ఎదిగి ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది !
అయితే ఈ మే 15న అనసూయ తన 38వ బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకుంటుంది, ఈ బర్త్ డే సంధర్భంగా సోషల్ మీడియా వేదికగా ఫ్రెండ్స్, ఫ్యామిలి అలాగే ఫ్యాన్స్ అందరూ తనకి బర్త్ డే గ్రీటింగ్స్ తెలియజేస్తున్నారు. అనసూయ హస్భండ్ సుశాంక్ తనకి సింపుల్ పార్టీని హోస్ట్ చేసి ఫ్యామిలి అందరిని పిలిచారు. ఫ్యామిలి సమక్షం లో అనసూయ బర్త్ డే సెలెబ్రేషన్ కి సంభంధించిన కొన్ని ఫొటోస్ బయటికి వచ్చాయి. ఈ పిక్స్ ప్రస్తుతం నెటిజన్లని బాగా ఆకట్టుకుంటున్నాయి. మరో సంవత్సరం వైజర్.. ఇంకో ఇయర్ బోల్డర్.. !! నన్ను ప్రేమించే అలాగే ఆదరించే ప్రతి ఒక్కరికి ఎప్పటికి రుణ పడి ఉంటానంటూ తనకి విష్ చేసిన వారందరికి థాంక్స్ తెలిపింది అనసూయ ! అనసూయా భరద్వాజ్ బర్త్ డే సెలెబ్రేషన్ ఫొటొస్ ని మీరూ కూడా చూసేయండి.