Brahmanandam son Engagement : బ్రహ్మానందం కొడుకు ఎంగేజ్‌మెంట్
కామెడి బ్రహ్మ గా చెప్పుకొనే టాలీవుడ్ సీనియర్ కమేడియన్ బ్రహ్మనందం గారికి తెలుగు వారిలో ఎంత మంచి గుర్తింపు ఉందో అందరికి తెలిసిందే, గత మూడు దశాబ్దాలుగా కొన్ని వేల సినిమాలలో నటించి లక్షలది అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఒక తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఇండియా వైడ్ గా కుడా బ్రహ్మానందం గారికి మంచి క్రేజ్ ఉంది. సినిమాలలో టి.వి షో లో మాత్రమే కాకుండా ప్రస్తుత కాలంలో మీమ్‌స్ లో కూడా కనిపిస్తూ ఎప్పుడూ ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేస్తుంటారు బ్రహ్మానందం. అయితే బ్రహ్మానందం గారి ఫ్యామిలి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. బ్రహ్మి గారి భార్య పేరు లక్ష్మీ గారు, వీళ్లకి ఇద్దరు అబ్బాయిలు, పెద్దబ్బాయి రాజా గౌతమ్ చిన్న కొడుకు సిద్దార్థ్.
బ్రహ్మానందం గారి పెద్దబ్బాయి రాజా గౌతమ్ నటుడిగా అందరికి సుపరిచితమే, రాజా గౌతమ్ కి పెళ్లైంది తనకి ఇద్దరు అబ్బాయిలు. అయితే రీసెంట్ గా బ్రహ్మానందం గారి చిన్న కొడుకు సిద్దార్థ్ కి ఘనంగా ఎంగేజ్‌మెంట్ జరిగింది. తనకి కాబోయే భార్య పేరు ఐశ్వర్య, తనొక డాక్టర్. హైదరాబాద్ లో జరిగిన ఈ పెళ్లికి ఫ్యామిలి మరియు బంధు మిత్రులతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరై కాబోయే వధూవరులని విష్ చేశారు. సిద్ధార్థ్ ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ కి సంభంధించిన కొన్ని ఫొటోస్ బయటికి వచ్చాయి, ఈ పిక్స్ ప్రస్తుతం నెటిజన్లని బాగా ఆకట్టుకుంటున్నాయి. బ్రహ్మానందం గారి చిన్న కొడుకు సిద్దార్థ్ ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ ని మీరూ చూసేయండి.