Dil Raju Dubai Vacation : మనమడితో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న దిల్ రాజు

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత రాజు గారు అందరికి సుపరిచితమే, 2003 లో నితిన్ దిల్ మూవీతో ప్రొడ్యూసర్ గా పరిచయమైన దిల్ రాజు ఈ సినిమా హిట్ అవడం తో ఇదే పేరు తన ఇంటి పేరుగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుత టాలీవుడ్ నిర్మాతలలో వన్ ఆఫ్ ది బెస్ట్ కొరియగ్రాఫర్ గా కొనసాగుతూ ఎన్నో ఫ్యామిలి ఎంటర్‌టైన్మెంట్ చిత్రాలని నిర్మిస్తూ సక్సెస్‌ఫుల్ గా దూసుకెల్తున్నారు దిల్ రాజు గారు. దిల్ రాజు కూతురు హన్షితా రెడ్డి కి కూడా ఇంటర్నెట్ లో మంచి ఫాల్లోయింగ్ ఉంది. రీసెంట్ గా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో తను ప్రొడ్యూస్ చేసిన మొదటి సినిమా బలగం భారీ విజయాన్ని అందుకొని ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా అందుకుంది. త్వరలోనే ఈ ప్రొడక్షన్ బ్యానర్ లో తన 2వ మూవీని అనౌన్స్ చేయబోతున్నట్లుగా సమాచారం.

హన్షితా రెడ్డికి ఇద్దరు చిల్డ్రన్ ఉన్నారు, బాబు పేరు ఆరాన్స్, అలాగే కూతురు ఇషిక. ఎప్పుడూ సినిమాలతో షూటింగ్స్ తో బిజీగా ఉండే దిల్ రాజు గారు ఎలాంటి ఫ్రీ టైమ్ దొరికిన మనమడు, మనమరాళ్లతో స్పెండ్ చేస్తారు. అయితే రిసెంట్ గా తన కూతురు హన్సితా రెడ్డి ఫ్యామిలితో కలిసి దుబాయి వెకేషన్ వెళ్లారు దిల్ రాజు. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే హన్షితా ఈ వెకేషన్ లో మనమడి తో బెస్ట్ టైం స్పెండ్ చేస్తున్న దిల్ రాజు గారి పిక్స్ ని షేర్ చేసింది. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెటిజన్లని బాగా ఆకట్టుకుంటున్నాయి, మనమడు ఆరాన్ష్ తో దిల్ రాజు దుబాయ్ వెకేషన్ ఫొటోస్ ని మీరూ చూసేయండి.