Instagram Down : యూజర్లని సతాయించిన ఇన్స్టాగ్రామ్
మొబైల్ అప్లికేషన్స్, వెబ్ సైట్స్ విజిటర్స్ ఎక్కువ అయినపుడు సర్వర్ బిజీ రావడం, సైట్ ఓపెన్ అవకపోవడం వంటివి జరగడం తెలిసిందే. ఇలాంటి సైట్ లేదా ఆ అప్లికేషన్ మేంటైన్ చేసే వాళ్లు వెంటనే తగు చర్యలు తీసుకొని యూజర్స్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా టెక్నికల్ గా వచ్చిన ఇష్యూస్ ని క్లియర్ చేస్తూ ఉంటారు, సరిగ్గా ఇలాంటి సాంకేతిక సమస్యే ఈ మే 21 సండే రోజున్ సాయంత్రం ఇన్స్టాగ్రామ్ యూజర్లకి ఎదురైంది. కొన్ని టెక్నికల్ గా వచ్చిన ప్రాబ్లమ్‌స్ తో ఇన్స్టా ఆప్ లోకి కొందరు ఉపయోగదారులకి ఆక్సెస్ రాకపోవడం అప్‌లోడ్ చేసిన ఇమేజ్ సైజెస్ మారడం వంటి సమస్యలు రావడం జరిగింది.
ఇలా జరిగిన సాంకేతిక సమస్య వల్ల ఇబ్బంది పడ్డ యూజర్ల సంఖ్య డైరెక్ట్ కంపెనీస్ చెప్పలేవు. కాని Downdetector.com అనే ఔట్ సోర్సింగ్ వెబ్‌సైట్ ప్రకారం వర్ల్డ్ వైడ్ గా 1,80,000 యూజర్లకి పైగా ఇన్స్టాగ్రమ్ ఆక్సెస్ చేయడం లో ఇబ్బందులు పడ్డారు.

సండే ఈవినింగ్ 5.45 నిమిషాల సమయం చాలా మందికి ఇన్స్టా ఆక్సెస్ నిలిపివేయబడింది. అయితే కొంత మంది వినియోగదారుల ఖాతాలని బ్యాకప్ చేసే సమయం లో ఇలాంటి సమస్య ఎదురైందని వీలైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించామని మెటా ప్రథినిధి రాయిటర్స్ తో చెప్పారు. Downdetector website ప్రకారం రాత్రి 8.30 నిమిషాల సమయంలో దాదాపు గా అందరు యూజర్ల సమస్య తీరినట్లుగా తెలుస్తుంది !