Kalyan Dev Sister Birthday : చెల్లెలి బర్త్ డేని ఎలా సెలెబ్రేట్ చేశారో చూడండి
మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడిగా పరిచయమైన కళ్యాణ్ దేవ్ తరువాత వరుసగా 3 సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2018 లో విజేత మూవీతో తెరంగ్రేటం చేసిన కళ్యాణ్ తరువాత సూపర్ మచ్చి అల్గే కిన్నెరసాని లాంటి సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా తను నటించిన కిన్నెరసాని మూవీ ఆక్టర్ గా కళ్యాణ్ దేవ్ తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. అయితే గత కొంత కాలంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్న కళ్యాణ్ దేవ్ తన రెగ్యులర్ అప్‌డేట్స్ ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు.
అయితే కళ్యాణ్ దేవ్ ఫ్యామిలి గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. కళ్యాణ్ నాన్న పేరు కిసన్ గారు, అమ్మ జ్యోతి కానుగంటి తనకి ఒక చెల్లెలు ఉంది. తన పేరు ఐశ్వర్య లంక. ఐశ్వర్య కి పెళ్లైంది. అయితే ఈ మే 27న ఐశ్వర్య తన బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకుంది. సిస్టర్ బర్త్ డే సంధర్భంగా కళ్యాణ్ దేవ్ కొంత మంది క్లోజ్ ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిచి ఐశ్వర్య కి గ్రాండ్ గా బర్త్ డే ని సెలెబ్రేట్ చేశారు. ఈ బర్త్ డే సెలెబ్రేషన్ కి సంభంధించిన కొన్ని ఫొటోస్ ని కళ్యాణ్ దేవ్ తన ఇన్స్టా వేదికగా షేర్ చేస్తూ ఐశ్వర్య కి విష్ చేశారు. ఈ పిక్స్ ప్రస్తుతం నెటిజన్లని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోస్ చూసిన వాళ్లంతా ఐశ్వర్య కి మరోసారి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. కళ్యాణ్ దేవ్ సిస్టర్ ఐశ్వర్య బర్త్ డే సెలెబ్రేషన్ పిక్స్ ని మీరూ చూసేయండి !