Manchu Manoj shared a cutest video on 1st month of his wedding day

మంచు మనోజ్, రెండు తెలుగు రాష్ట్రాలలో పరిచయం అవసరం లేని పేరు. డైలాగ్ కింగ్ డా. మంచు మోహన్ బాబు గారి కొడుకు గానే కాకుండా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజు భాయ్, వేదం, బిందాస్, కరెంట్ తీగ, మిస్టర్ నోకియా వంటి మూవీస్ తో ప్రేక్షకులని అలరించారు మనోజ్. త్వరలో వాట్ ది ఫిష్ మూవీ చేయబోతున్నారు. సోషల్ సర్వీస్‌లోనూ, సోషల్ ఆక్టివిటీస్ లోను ముందుంటారు మనోజ్. అయితే మనోజ్ కి రీసెంట్ గా వివాహం జరిగిన సంగతి తెలిసిందే, ప్రముఖ దివంగత నేత భూమా నాగిరెడ్డి గారి కూతురు భూమ మౌనికతో మనోజ్ కి ఫ్యామిలి మరియు బంధు మిత్రుల సమక్షంలో చాలా ఘనంగా వివాహం జరిగింది.

ఎప్పుడూ సోషల్ మీడుయాలో ఆక్టివ్ గా ఉంటూ తన డైలీ లైఫ్ కి సంభందించిన ఫొటోస్ & వీడియోస్‌ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటారు మనోజ్, అయితే ఈ ఎప్రిల్ 3వ తేదీతో మనోజ్ కి పెళ్లై వన్ మంత్ కావడంతో తన భార్య భూమా మౌనికతో కలిసి ఉన్న ఒక క్యూటెస్ట్ వీడియోని షేర్ చేస్తూ “ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు” అంటూ ట్యాగ్ చేశారు. మనోజ్ షేర్ చేసిన ఈ విడియో ప్రస్తుతం నెటిజన్లని బాగా ఆకట్టుకుంటుంది. ఈ విడియో చూసిన వాళ్లంతా లవ్‌లీ కపుల్, ఎల్లప్పూడు హాపీ గా ఉండంటంటూ కామెంట్స్ పెడుతున్నారు. మనోజ్ మంచు, భూమ మౌనికల ఆ క్యూటెస్ట్ వీడియో ని మీరు చూసేయండి !