Niharika with Lavanya Tripati : వరుణ్ ఎంగేజ్‌మెంట్ పై క్లారిటి ఇచ్చిన నిహారిక

మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు నాగబాబు గారికి టాలీవుడ్ లో ఎంత మంచి గుర్తింపు ఉందో అందరికి తెలిసిందే, నాగ బాబు గారి భార్య పేరు పద్మజ కొణిదెల. వీళ్లకి ఇద్దరు పిల్లలు కొడుకు వరుణ్ తేజ్, కూతురు నిహారిక. వరుణ్ కి కూడా నటుడిగా తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది, నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఒకవైపు ప్రొడ్యూసర్ గా మంచి మంచి వెబ్ సిరీస్ నిర్మిస్తూ మరో వైపు తను కూడా నటిస్తూ బిజీగా గడిపేస్తుంది. అయితే గత కొన్ని నెలలుగా వరుణ్ తేజ్ పెళ్ళి గురించిన వార్తలు ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నటి లావణ్య త్రిపాటి తో వరుణ్ పెళ్లి జరగబోఉందంటూ వార్తలు వస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

ఈ జూన్ లో వరుణ్, లావణ్యల ఎంగేజ్‌మెంట్ జరగబోతుందంటూ టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ విషయం పై అటు లావణ్య ఫ్యామిలి నుండి గాని, ఇటు మెగా ఫ్యామిలి నుండి గాని ఎలాంటి ఇంఫర్‌మేషన్ లేదు. అయితే తాజా గా ఈ విషయం పై మాట్లాడింది వరుణ్ సిస్టర్ నిహారిక. త్వరలో చాలా గ్యాప్ తరువాత నిహారిక నటించిన డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతుంది, ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తన రీసెంట్ ఇంటర్‌వ్యూ లో ఇంటర్‌వ్యూవర్ వరుణ్, లావణ్యల ఎంగేజ్మెంట్ గురించి అడగగా, ఒక నవ్వు నవ్వి నేను కేవలం వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం మాత్రమే వచ్చానంటూ చెప్పుకొచ్చింది నిహారిక. ఇదిలా ఉండగా ఎప్పటినుండో లావణ్య త్రిపాటికి నిహారికకి మంచి బాండింగ్ ఉన్న సంగతి కూడా అందరికి తెలుసు. ఈ విషయంపై క్లారిటి కోసం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే !

Niharika with Lavanya Tripati