Chaitra Rai in NTR 30 : ఎన్.టి.ఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర నటి

Chaitra-Rai-NTR-30

ప్రముఖ బుల్లితెర నటి చైత్రా రాయ్ అందరికి సుపరిచితమే, అష్టా చెమ్మా సీరియల్ తో తెలుగు బుల్లితెర ఎంట్రి ఇచ్చిన ఈ కన్నడ నటి, తరువాత అలా మొదలైంది, అత్తో అత్తమ్మ కూతురో, దట్ ఈజ్ మహాలక్ష్మీ, ఒకరికరు, మనసున మనసై వంటి సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది, సీరియల్స్ మాత్రమే కాకుండా టి.వి షోస్ తో కూడా అలరించింది చైత్ర. చైత్ర రాయ్ భర్త పేరు ప్రశాంత్ శెట్టి, రీసెంట్ గానే చైత్రా ప్రశాంత్ లకి పాప జన్మించింది, పాపకి నిష్క శెట్టి అని నామకరణం చేశారు. పాప పుట్టిన అనంతరం కొద్ది రోజుల పాటు కెరీర్ నుండి బ్రేక్ తీసుకున్న చైత్ర తిరిగి సీరియల్స్ లో నటిస్తుంది.

ఇదిలా ఉండగా RRR Movie అనంతరం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివ గారి దర్శకత్వంలో చేయబోతున్నారు. స్వర్గీయ శ్రీదేవి గారి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ ఫేం సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటించబోతున్నారు. అయితే తాజాగా బుల్లితెర నటి చైత్రారాయ్ ఈ సినిమాలో నటిగా అవకాశం దక్కించుకున్నట్టుగా ఇంటర్నెట్ లో న్యూస్ తెగ వైరల్ అవుతుంది. కాని చైత్ర దగ్గర్నుండి గాని, మూవీ టీం దగ్గర్నుండి కాని ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదు. ఇప్పుడున్న సమాచారం ప్రకారం #NTR30 Movieలో సైఫ్ ఆలీ ఖాన్ వైఫ్ గా చైత్ర నటించబోతుందట !